Tata Cancer Hospital: తిరుపతిలో టాటా కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Tata Cancer Hospital: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో టాటా గ్రూప్ ఏర్పాటు చేసిన కేన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పటల్‌ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 5, 2022, 11:55 PM IST
  • అత్యాధునిక సౌకర్యాలతో తిరుపతిలో కేన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ హాస్పటల్
  • టాటా గ్రూప్ నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • అన్నిరకాల కేన్సర్ చికిత్స, వైద్య పరీక్షలు అందుబాటులో
Tata Cancer Hospital: తిరుపతిలో టాటా కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Tata Cancer Hospital: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో టాటా గ్రూప్ ఏర్పాటు చేసిన కేన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పటల్‌ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.

కేన్సర్ రోగులకు గుడ్‌న్యూస్. దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ తిరుపతిలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ఈ ఆసుపత్రిని ఇవాళ ఏపీ ముఖ్మంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ ప్రభుత్వంతో కలిసి టాటా గ్రూప్ ఈ రీసెర్చ్ ఆసుపత్రిని నిర్వహిస్తుంది. 

టాటా గ్రూప్ ఏపీలో ఈ అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించడం గర్వకారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల కేన్సర్ చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. తిరుపతి పట్టణానికే కాకుండా మొత్తం రాష్ట్రానికే ఈ ఆసుపత్రి ఓ మణిపూస అని వైఎస్ జగన్ చెప్పారు. టీటీడీ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేసిన కృషికి టాటా గ్రూప్ సహాయం అందించిందని గుర్తు చేశారు. వైద్యరంగంలో టాటా గ్రూప్ మరింత భాగస్వామ్యం అవసరమన్నారు. ఆంకాలజీ విభాగంలో నోరి దత్తాత్రేయుడు కీలక భూమిక వహిస్తున్నారని చెప్పారు. 

Also read: Chandrababu Challenge :రాజకీయాల నుంచి తప్పుకుంటా.. జగన్ కు చంద్రబాబు సవాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News