పోలవరంపై సభలో సీఎం ప్రసంగం

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు సభలో ప్రసంగించారు. ఆరు నూరైనా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం అని నొక్కి చెప్పారు.

Last Updated : Nov 23, 2017, 09:47 AM IST
    • ఆరు నూరైనా పోలవరం ఆగదు
    • రూ. 129 కోట్లతో పూర్తయ్యేది.. రూ.58వేల కోట్లకు చేరింది
    • త్వరగా పూర్తయితే.. ప్రజలకు లాభం
పోలవరంపై సభలో సీఎం ప్రసంగం

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు సభలో ప్రసంగించారు. ఆరు నూరైనా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం అని నొక్కి చెప్పారు.  పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైందని.. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఈ ప్రాజెక్టు పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలిపారు. తాము ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వద్దకు 20 సూర్లు వెళ్ళివచ్చామని గుర్తుచేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పోలవరంపై కేంద్ర పెద్దలతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర విభజన తరువాత ఏడు ముంపు గ్రామాలను ఏపీలో కలపడంవల్ల అడ్డంకి ఆన్న మాట వాస్తమేనని.. ఆ సమస్య తొలగిందని సీఎం చెప్పారు. వాయిదాలు వేయకుండా పూర్తిచేసి ఉంటే రూ.129 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. సవరించిన అంచనాల ప్రకారం రూ.58వేల కోట్లకు చేరింది అని ఆయన తెలిపారు. ఇప్పటివరకు రూ.12,567.22 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. కేంద్రం ఇప్పటివరకు రూ.4329 కోట్లు ఇచ్చింది. రేడియల్ గేట్లు వందశాతం పూర్తయ్యాయని సీఎం తెలిపారు. ఇది ఒక జాతీయ ప్రాజెక్టు.. ఇది ఎంత తొందరగా పూర్తయితే.. ప్రజలకు అంత లాభం అని శాసనసభలో సీఎం ప్రసంగించారు.

Trending News