తెలంగాణలో శ్రీరంగాపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయం తెలంగాణలో ప్రముఖమైనది. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది.
అదితీ-సిద్ధూ పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచిన రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయం వనపర్తి సంస్థానాదీశుల ఆధ్వర్యంలో నిర్మించారు.
గర్భాలయంలో శ్రీరంగనాథ స్వామి కొలువై ఉంటాడు. అచ్చం శ్రీరంగంలో మాదిరి రంగనాథ స్వామి విగ్రహం ఉంటుంది.
తమిళనాడులోని ప్రముఖ శ్రీరంగం ఆలయాన్ని పోలి శ్రీరంగాపురం ఆలయం ఉండడం గమనార్హం.
ఆలయ గోపురం ఎన్నో శిల్పాలను తీర్చిదిద్ది ఉంటుంది. శిల్పకళతో ఈ ఆలయం తొణికిసలాడుతుంది.
ఈ ఆలయంలో ఏడాదిలో మూడు ఉత్సవాలు ప్రముఖంగా జరుగుతాయి. సంక్రాంతికి కోటై ఉత్సవాలు, మార్చిలో రథోత్సవం, శ్రావణమాసంలో ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఆధ్యాత్మికతతోపాటు ఈ ఆలయం సినిమాలు, ప్రీ వెడ్డింగ్ షూట్, ఫొటోషూట్‌లకు కేంద్రంగా నిలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు, సీరియల్స్ ఇక్కడ చిత్రీకరించారు.
ఈ ఆలయానికి సమీపంలో మరికొన్ని చారిత్రక ఆలయాలు ఉన్నాయి. గద్వాల్ చెన్నకేశవ స్వామి ఆలయం, కొల్లాపూర్ మాధవ స్వామి ఆలయం, కొల్లాపురి సోమేశ్వర స్వామి ఆలయం సోమశిల, అగైస్తర్య స్వామి ఆలయం జటప్రోలు, బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం తదితర ఉన్నాయి.