ఐపీఎల్ 2024లో ఎస్ఆర్ హెచ్ పై 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ముంబై ఇండియన్స్ 246 పరుగులు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఛేజింగ్‌లో ఇదే అత్యధిక స్కోరు.
2020 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ రెండో ఇన్నింగ్స్‌లో 226 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టే విజయం సాధించింది.
ఆర్ఆర్ తన 2010 రికార్డును బద్దలు కొట్టింది. ఆ ఏడాది సీఎస్కే పై ఆ జట్టు 223 పరుగులు చేసింది. కానీ ఆ జట్టు గెలవలేకపోయింది.
2017 ఐపీఎల్ లో భారీ స్కోరును ఛేదించే క్రమంలో ముంబై జట్టు ఓడిపోయింది. ఆ సమయంలో ఆ జట్టు 223 పరుగులు చేసింది.
ముంబై 2019లో విజయవంతమైన ఛేజింగ్ చేసింది. ఐపీఎల్ 2019లో పంజాబ్‌పై ముంబై ఛేజింగ్‌లో 219 పరుగులు చేసి గెలిచింది.
ఈ జాబితాలో ఆర్సీబీ ఆరో స్థానంలో ఉంది. 2023 ఐపీఎల్ లో సీఎస్కేపై ఛేజింగ్ లో ఆర్సీబీ 218 పరుగులు చేసింది. కానీ ఆ జట్టు గెలవలేకపోయింది.
2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై ఛేజింగ్‌లో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జట్టు విజయం సాధించింది.
2021లో పంజాబ్‌పై ఛేజింగ్‌లో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. కానీ జట్టు పరాజయం పాలైంది.
గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ పై ఛేజింగ్ లో 217 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్.
ముంబై జట్టు టాప్-10లో నాల్గో సారి చోటు దక్కించుకుంది. ఎందుకంటే ఈ జట్టు ఛేజింగ్‌లో 216 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది.