బాదం మిల్క్‌ రెసిపీకి కావాల్సిన పదార్థాలు-1:

1/2 కప్పు బాదం, 3 కప్పుల నీరు, 1/4 టీస్పూన్ యాలకుల పొడి, 1/4 టీస్పూన్ కుంకుమపువ్వు.

Dharmaraju Dhurishetty
Mar 29,2024
';

బాదం మిల్క్‌ రెసిపీకి కావాల్సిన పదార్థాలు-2:

2 టేబుల్ స్పూన్ల చక్కెర లేదా తేనె (రుచికి సరిపడా), 1/4 కప్పు ఖర్జూరాలు, తగినంత చెక్కర, ఐస్‌ ముక్కలు

';

తయారీ విధానం పార్ట్‌-1:

బాదం పప్పులను రాత్రంతా నానబెట్టండి. ఉదయం, బాదంలను ఒలిచి, నీటితో శుభ్రంగా కడగాలి.

';

పార్ట్‌-2:

బాదం, యాలకుల పొడి, కుంకుమపువ్వు (ఉపయోగిస్తే), చక్కెర లేదా తేనె (రుచికి సరిపడా) ఒక బ్లెండర్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

';

పార్ట్‌-3:

ఖర్జూరాలు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఒక గుడ్డతో వడకట్టి, ఒక గ్లాసులో పోయాలి. వెంటనే తాగండి లేదా రిఫ్రిజిరేటర్‌లో చల్లబడిన తర్వాత తాగండి.

';

చిట్కా-1:

బాదం మిల్క్‌ మరింత రుచిని పొందడం కోసం, మీరు 1/4 టీస్పూన్ జాజికాయ పొడి లేదా 1/2 టీస్పూన్ ఏలకుల పొడి కూడా వేయవచ్చు.

';

చిట్కా-2:

మీరు బాదం పాలను మరింత చిక్కగా కావాలనుకుంటే, 1/4 కప్పు పెరుగు లేదా 1/4 కప్పు ఖోవా వేయవచ్చు. బాదం పాలను 3-4 రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.

';

ఆరోగ్య ప్రయోజనాలు:

బాదం పాలలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.

';

ఆరోగ్య ప్రయోజనాలు:

ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది. దీంతో పాటు మధుమేహాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story