మనం రోజు తాగవలసిన డ్రింక్ తెలుసుకునే ముందు ఒక చిన్ని చిట్కా మీకోసం. అదేమిటంటే.. ప్రతిరోజు తినే ముందు వేడిగా ఉండే నీళ్లు తీసుకోండి. ఇది మెటబాలిజం వేగవంతం చేస్తుంది.
అలానే ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో.. అర స్పూన్ నిమ్మరసం కలిపి బాగా కలపండి.
అందులోనే ఒక స్పూన్ తేనె కలపండి. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
ఇక ఆ నిమ్మకాయ నీళ్లలోనే.. చిటికెడు దాల్చినచెక్క పొడి వేయండి. ఇది కొవ్వు కరిగించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఇది బాగా కలిపి రోజూ ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకోండి.
ఈ పానీయం రోజూ తాగడం ద్వారా పొట్ట కొవ్వు తగ్గటంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
వాకింగ్ లేదా చిన్నపాటి వ్యాయామం చేస్తే ఫలితం ఇంకా త్వరగా ఉంటుంది.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.