టమాటా చట్నీకి పచ్చగా కాదు.. బాగా నేరేడు రంగు గల పండిన టమాటాలు మాత్రమే తీసుకోండి.
టమాటాలతో పాటు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం కలిపి వేయిస్తే చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది.
నూనె వేడి చేసి టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని బాగా వేయించుకోవాలి.
చిటికెడు పులుసు చింతపండు.. చివరిలో కలిపితే చట్నీకి ప్రత్యేకమైన రుచి వస్తుంది.
వేడిగా ఉన్న టమాటా మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి.
పచ్చడికి చివరగా నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించి తాళింపు వేసుకొని…అందులో మనం చేసి పెట్టుకున్న టమాటా చట్నీని వెయ్యాలి. అంతే నోరూరించే చెట్ని రెడీ.
టమాటా చట్నీని వేడి ఇడ్లీ, దోసెల్లోకి సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది.