కుంభమేళ ఉత్సవంకు ఉత్తర ప్రదేశ్ లో వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జన్వరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి.
ఈ కాలంలో నదుల్లో దేవతలు నివసిస్తారని చెబుతుంటారు.
దేశ వ్యాప్తంగా సాధులు, సంత్ లు, నాగ సాధులు యూపీకి పుణ్యస్నానాలకు వస్తారు.
కుంభమేళకు వెళ్లాలనే కోరిక ఉండి వెళ్లలేని వారు ఈ టిప్స్ పాటించాలని పండితులు చెబుతున్నారు.
కుంభమేళ పుణ్యకాలంలో మీకు దగ్గరగా ఉండే దేవస్థానాలకు వెళ్లి అక్కడ స్నానం చేయాలి.
గంగ నీళ్లను.. బకెట్ లో వేసుకుని కుంభమేళ పేరు తల్చుకుని స్నానం చేస్తే.. అక్కడ స్నానం చేసిన పుణ్యం వస్తుందంట.