HMPV Signs: ప్రపంచాన్ని భయపెడుతున్న చైనా వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు ఇండియాలో ఎంట్రీ ఇచ్చేసింది జాగ్రత్త

Md. Abdul Rehaman
Jan 06,2025
';


ఊహించిందే జరిగింది. ఇండియాలో ఈ ప్రమాదకర వైరస్ వచ్చేసింది. అప్పుడే 5 కేసులు వెలుగుచూశాయి.

';


కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. 8 నెలలు, 3 నెలల పసికందులకు ఈ వ్యాధి సోకింది

';


కర్ణాటక పొరుగు రాష్ట్రం కావడంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అందోళన చెందుతున్నాయి.

';


అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు

';


అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి. పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కన్పిస్తే అప్రమత్తం కావాలనేది తెలుసుకుందాం.

';


ఈ వైరస్ బారినపడ్డ పిల్లలకు ఎక్కువగా జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది

';


హెచ్ఎంపీవీ సోకిన పిల్లలకు నిమోనియా, బ్రాంకైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్ బారిన పడే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఇంట్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

';


బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలి, శానిటైజర్ వినియోగించాలి, పిల్లల్ని వీలైనంతవరకూ బయటకు తీసుకురాకపోవడమే మంచిది

';

VIEW ALL

Read Next Story