HMPV వైరస్ లక్షణాలు.. చికిత్స, నివారణ చిట్కాలు ఇవే..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కర్ణాటకలో రెండు హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (HMPV) కేసులను గుర్తించింది. ధృవీకరించింది.
ఈ వైరస్ లక్షణాలు.. చికిత్స, నివారణ చిట్కాలు ఏంటో చూద్దాం..
HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) అనేది శ్వాసకోశ వైరస్. ఇది తేలికపాటి నుండి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతుంది.
హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తికి సంబంధించిన ఇటీవలి నివేదికల తరువాత.. కేంద్రం వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఎక్కువగా దీని బారిన పడే అవకాశాలున్నాయని సూచించారు.
ముఖ్యంగా వయసు మళ్లిన పెద్దలు ముసుగులు ధరించాలని సూచించారు.
ప్రస్తుతానికి ఈ వైరస్ కు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
HMPV సంక్రమణలో సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు మూసుకుపోవడం వంటివి దీని లక్షణాలు
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. గొంతు నొప్పి వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు..
వైరస్ తీవ్రత ఎక్కువగా న్యూమోనియో ఉంటే వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అవ్వండి..
సి విటమిన్ కు సంబంధించిన పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయాలి.
HMPVకి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స లేదు.
ముఖ్యంగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం..
ఇక ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధానికి దూరంగా ఉండాలి.
అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండడం వంటివి బెటర్..