‘గేమ్ చేంజర్’ టూ ‘డాకు మహారాజ్’ జనవరిలో ప్రేక్షకులను పలకరించబోతున్న భారీ చిత్రాలు ఇవే..

TA Kiran Kumar
Jan 07,2025
';

గేమ్ ఛేంజర్ (తెలుగు) - జనవరి 10

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి రేసులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీలో ఏక కాలంలో విడుదల అవుతోంది.

';

ఫతే (హిందీ)- జనవరి 10

సోనూ సూద్ మెగా ఫోన్ పట్టుకొని తాను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఫతే’. ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

';

డాకు మహారాజ్ (తెలుగు) - జనవరి 12

బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

';

సంక్రాంతికి వస్తున్నాం (తెలుగు)- జనవరి 14

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సంక్రాంతి రేసులో చివరగా జనవరి 14న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

';

మద గజ రాజా (తమిళం) - జవనరి 12

విశాల్ హీరోగా నటించిన ‘మద గజ రాజా’ సినిమా ఎపుడూ షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి బరిలో తమిళంలో ఏ సినిమా లేకపోవడంతో ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు.

';

వనంగాన్ (తమిళం) - జనవరి 12

అరుణ్ విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘వనంగాన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

';

ఆజాద్ (హిందీ) - జనవరి 17

అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆజాద్’. ఈ సినిమా జనవరి 17న విడుదల కాబోతుంది.

';

ఎమర్జెన్సీ (హిందీ) - జనవరి 17

కంగనా రనౌత్ కథానాయికగా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జన్సీ’. ఈ చిత్రం జనవరి 17న విడుదల కాబోతుంది.

';

స్కై ఫోర్స్ (హిందీ) - జనవరి 24

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. రిపబ్లిక్ కానుకగా 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

';

దేవ (హిందీ) - జనవరి 31

షాహిద్ కపూర్, పూజా హెగ్డే నాయికా.. నాయకులుగా నటించిన ఈ చిత్రం జవనరి 31న విడుదల కాబోతుంది.

';

ఐడెంటిటీ (మలయాళం) - జనవరి 31

టొవినో థామస్ నటించిన ‘ఐడెంటిటీ’ మూవీ జవనరి 31న విడుదల కాబోతుంది.

';

VIEW ALL

Read Next Story