Hair Mask Remedy: చలికాలంలో డేండ్రఫ్ వేధిస్తుంటే ఈ మూడు వస్తువులతో ఇట్టే నిర్మూలించవచ్చు
చలికాలం వచ్చిందంటే చాలు చర్మ, కేశ సమస్యలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా తలలో డేండ్రఫ్ ప్రధాన సమస్యగా మారుతుంది. దాంతో కేశాలు నిర్జీవంగా మారిపోతాయి. పటుత్వం కోల్పోతాయి
డేండ్రఫ్ సమస్య నుంచి బయటపడేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
మీరు కూడా డేండ్రఫ్ సమస్య నుంచి విముక్తి పొందాలనుకుంటే ఈ మూడు వస్తువలు వాడితే చాలు
దీనికోసం అల్లోవెరా జెల్, వేప, కరివేపాకుతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవాలి
ఈ హెయిర్ మాస్క్ తయారు చేసేందుకు ముందుగా అల్లోవెరా జెల్ తీసుకోవాలి
ఇందులో వేప, కరివేపాకులు పౌడర్ చేసి కలపాలి. పేస్ట్‌లా మార్చుకోవాలి
ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్‌లా రాసుకుని అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి
ఇలా వారంలో రెండు సార్లు రాయడం వల్ల డేండ్రఫ్ సమస్య పోతుంది.