ఇది రోజు తింటే కొవ్వు దెబ్బకు మెల్ట్ అవ్వాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jan 10,2025
';

సలాడ్స్ రోజు తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అద్భుతమైన పోషకాలు మానవ శరీరానికి ఎంతగానో సహాయపడతాయి.

';

ముఖ్యంగా తెల్ల శనగల సలాడ్ రోజు తింటే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

';

అలాగే ఈ సలాడ్ తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గి బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ సలాడ్ ను తింటే విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

';

మీరు కూడా రోజు ఈ సలాడ్ ను తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: తెల్ల శనగలు: 1 కప్పు (రాత్రంతా నానబెట్టి ఉడికించినవి), టమాటోలు: 1 కప్పు (ముక్కలుగా తరిగిన), ఉల్లిపాయ: 1/2 కప్పు (ముక్కలుగా తరిగిన), క్యాప్సికం: 1/2 కప్పు (ముక్కలుగా తరిగిన)

';

కావలసిన పదార్థాలు: కీరదోసకాయ: 1/2 కప్పు (ముక్కలుగా తరిగిన), కొత్తిమీర: 1/4 కప్పు (తరిగిన), నిమ్మరసం: 2-3 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: 2-3 టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి తగినంత, మిరియాల పొడి: రుచికి తగినంత, చాట్ మసాలా: రుచికి తగినంత

';

తయారీ విధానం: ముందుగా ఈ సలాడ్ని చేసేందుకు తెల్ల శనగలను రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే వాటిని బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా ఉడికించుకున్న తెల్ల శనగలను ఓ బౌల్లోకి తీసుకొని అందులో తరిగిన టమాటోలు, ఉల్లిపాయలు, క్యాప్సికం, కీరదోసకాయ వేసుకొని మిక్స్ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత.. కొత్తిమీర నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా అన్ని వేసుకుని కలుపుకోండి..

';

ఇలా బాగా అన్నీ కలిసిన తర్వాత రెండు నిమిషాలు ఆగి సర్వ్ చేసుకోండి. ఇలా చేసిన సలాడ్ రోజు తింటే బరువుతో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story