Recipe: సంక్రాంతి స్పెషల్ రేగి పండ్ల పచ్చడి ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే

Bhoomi
Jan 11,2025
';

సంక్రాంతి స్పెషల్

సంక్రాంతి పండగ వచ్చిందంటే పిండి వంటలు,గాలిపటాలు, రంగవల్లులతోపాటు భోగి పండ్లు కూడా ఫేమస్.

';

భోగిపండ్లు

భోగి పండగ రోజు చిన్నపిల్లలపై రేగు పండ్లు పోస్తుంటారు. అయితే వీటితో పచ్చడి కూడా చేస్తారు. ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరూ ఓ సారి ట్రై చేయండి.

';

కావాల్సిన పదార్థాలు

నూనె, ఆవాలు, మినపప్పు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, కొత్తిమీర, ఉప్పు, రేగుపండ్లు

';

తయారీ విధానం

ముందు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంటో నూనె పోసి..కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, ఇంగువ, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి.

';

ఇవి కూడా

వేగిన తర్వాత అందులో ఎండినమిరపకాయలు, కరివేపాకు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. దీంట్లోనే చింతపండు, కొత్తిమీర వేసి కలపాలి. వేగిన తర్వాత రేగుపండ్లు వేయాలి.

';

రేగుపండ్లు

రేగుపండ్లు నూనెలో వేగుతుండగా రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు పెట్టాలి.

';

గ్రైండ్

చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి. ఓపిక ఉంటే రోటిలోనూ దంచుకోవచ్చు.

';

మిశ్రమం

ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని..పోపు పెట్టుకోవాలి.

';

పచ్చడి రెడీ

అంతే సింపుల్ రుచికరమైన కమ్మటి రేగుపండ్ల పచ్చడి రెడీ. అన్నంలో కానీ చపాతీ, దోశలో కానీ కలుపుకుని తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story