సంక్రాంతి స్పెషల్ నమక్ పారా స్నాక్.. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు..
Dharmaraju Dhurishetty
Jan 11,2025
';
సంక్రాంతి సందర్భంగా చాలామంది నమక్ పారా స్నాక్ ను కూడా ఎక్కువగా తయారుచేసుకొని తింటూ ఉంటారు.
';
ముఖ్యంగా పిల్లలయితే పాలు తాగే క్రమంలో నమక్ పారా ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే దీనిని పెద్దలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు.
';
మీరు కూడా ఇంట్లోనే సులభంగా నమక్ పారా తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా? ఇలా సులభమైన పద్ధతిలో తయారు చేసుకోండి.
';
నమక్ పారా తయారీకి కావలసిన పదార్థాలు, పూర్తి తయారీ విధానం..
';
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నూనె, ఉప్పు, వాము (కావలసినంత), అల్లం, పసుపు (కావలసినంత), కారం పొడి (కావలసినంత), జీలకర్ర పొడి (కావలసినంత)
';
తయారీ విధానం: ముందుగా నమక్ పారాను తయారు చేసుకోవడానికి గోధుమ పిండిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పాత్ర పెట్టుకొని అందులో ఈ పిండిని వేసుకొని, వాము, ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి.
';
అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా కాగిన నూనెను కూడా వేసుకోండి. ఆ తర్వాత కావాల్సినన్ని మసాలాలు వేసుకొని పిండిని నీరు పోస్తూ బాగా కలుపుకోండి.
';
ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మందపాటి రోటీలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి.
';
ఇలా పక్కన పెట్టుకున్న రోటీలను ఒకదానిపై ఒకటి వేసి నమక్ పారా ముక్కలుగా చిన్నగా చాక్ తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను నూనె లేవు వేయించి తీసుకుంటే రుచి వేరే లెవెల్..