సంక్రాంతి స్పెషల్ నోరూరించే మైసూర్ పాక్ రెసిపీ.. తయారీ చాలా సులభం..
Dharmaraju Dhurishetty
Jan 11,2025
';
మైసూర్ పాక్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందరూ ఎంతో ఇష్టపడి మరీ తింటూ ఉంటారు.
';
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని చాలామంది ఈ స్వీట్ ను ఎక్కువగా తయారుచేసుకొని తింటూ ఉంటారు.
';
ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఈ స్వీట్ ను తినేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.
';
మైసూర్ పాక్ ను వివిధ పద్ధతుల్లో తయారు చేసుకుంటారు. ఈరోజు మనం సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
';
మైసూర్ పాక్ కు కావలసిన పదార్థాలు: శనగపిండి - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, నీరు - 3/4 కప్పు, నెయ్యి - 1 కప్పు, నూనె - 1 కప్పు, యాలక పొడి - 1/4 టీస్పూన్
';
తయారీ విధానం: ఈ మైసూర్ పాక్ ను తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో శనగపిండిని వేసి నెమ్మదిగా కలుపుతూ వేయించుకోండి.
';
ఇలా వేయించుకున్న తర్వాత శెనగపిండిని పక్కకు పెట్టుకొని.. అదే పాత్రలో తగినంత పంచదార వేసుకొని తీగ పాకం వచ్చేంతవరకు కలుపుతూ ఉండండి.
';
పాకం వచ్చిన తర్వాత తగినంత నెయ్యి వేసుకొని మరికొద్ది సేపు కలుపుకోండి. చివరగా ఇందులో శెనగపిండిని వేసుకుని, నెమ్మదిగా వేడి మీద కాగుతున్న నెయ్యిని పోసుకుంటూ కలుపుకోండి.
';
ఇలా నెయ్యిని పోసుకుంటూ కలుపుకొని ఒక ట్రే తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని పోసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
మిశ్రమం బాగా ఆరిన తర్వాత చిన్న చిన్న కట్ చేసిన ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ గాజు సీసాలో భద్రపరుచుకోండి.