చెడు కొవ్వును మాయం చేసే సీక్రెట్ డ్రింక్.. వారం రోజులు తాగితే చాలు!

Dharmaraju Dhurishetty
Jan 06,2025
';

ఆధునిక జీవనశైలి అనుసరించే చాలా మందిలో కొలెస్ట్రాల్ పరిమాణం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీని కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

కొంతమందిలో చెడు కొవ్వు పరిమితికి మించి పెరుగుతోంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చి ప్రాణాపాయ స్థితికి కూడా దారితీస్తోంది.

';

మరి కొంతమందిలోనైతే కొవ్వు పరిమాణాలు ఎక్కువగా పెరగడం వల్ల మధుమేహం సమస్య కూడా వస్తోంది.

';

ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి తప్పకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు. కేవలం కొన్ని రకాల ఆయుర్వేద రెమిడీలను వినియోగించి దీనికి చెట్ పెట్టొచ్చు.

';

ముఖ్యంగా జీరా, లెమన్ వాటర్ రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే సులభంగా ఈ చెడు కొవ్వు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

';

ప్రస్తుతం చాలామంది జీరా, లెమన్ వాటర్ తయారు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు పడుతున్నారు. అయితే మేము అందించే ప్రత్యేకమైన పద్ధతిలో ఈ వాటర్ తయారు చేసుకోండి తాగితే కొవ్వు సులభంగా కరిగిపోతుంది.

';

కొవ్వు కరిగించడానికి లెమన్ వాటర్ ప్రతిరోజు ఎలా తయారు చేసుకోవాలో? కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

';

ఈ జీరా వాటర్ ను తయారు చేసుకోవడానికి ముందుగా జీలకర్రను తీసుకొని ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న జీలకర్ర వాటర్ను ఉదయాన్నే వేరు చేసుకోవాలి.

';

ఇలా వేరు చేసుకున్న తర్వాత అందులో తగినంత నిమ్మరసం, కావలసినంత తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి.

';

ఇలా పెట్టుకున్న తర్వాత ఉదయం లేచిన వెంటనే ఈ జీలకర్ర వాటర్ ని తాగితే బెల్లీ ఫ్యాట్, కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story