HMPV Diet: అమ్మో వైరస్ అనకండి ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి

Bhoomi
Jan 06,2025
';

హెచ్ఎంపీవీ

హెచ్ఎంపీవీ వైరస్ సోకినవారు..సోకనివారు ఎవరైనా సరే ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

';

బ్యాలెన్స్ డైట్

మన ఆహారంలో ప్రతి పోషకాలు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి.

';

ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి

పోషక ధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, నట్స్‌ అండ్‌ సీడ్స్‌, పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, ప్యాట్స్‌ అండ్‌ ఆయిల్స్‌ ఇవన్ని ప్రతిరోజూ మన డైట్లో ఉండేలా చూసుకోవాలి.

';

రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు

పైన చెప్పిన వాటిల్లో కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఫ్రూట్ వెజిటేబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యూనిటీ పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి.

';

ఈ విటమిన్స్ లోపిస్తే

చాలామందికి విటమిన్ డీ, బీ12 అనీమియా, ఐరన్, జింక్ వంటి లోపం ఉంటుంది. ఈ మహమ్మారులు అటాక్ చేస్తున్న సమయంలో వాటి లోపం లేకుండా చూసుకోవాలి.

';

ఇమ్యూనిటీ పెంచేందుకు

మంచి ఆహారం తీసుకుంటే వైరస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు అనేవి రావు. వైరస్ శరీరంలోకి ఎంటర్ అవ్వగానే వాటిని అడ్డుకునే యాంటీ బాడీస్ తయారు చేయడానికి ఇమ్యూనిటీ అవసరం అవుతుంది.

';

ఇమ్యూనిటీ పెరగాలంటే

పండ్లు (100 నుంచి 150 గ్రాములు), కూరగాయాలు (250 గ్రాముల నుంచి 300 గ్రాములు) మొత్తం కలిపి 400 గ్రాములు తప్పకుండా తీసుకోవాలి. ఇవే కాదు ఇమ్యూనిటీ పెంచే డ్రైప్రూట్స్‌, నట్స్‌ కూడా తినాలి.

';

ఇమ్యూనిటీ బూస్టర్లు

చాలా మంది మార్కెట్లో దొరికే ఇమ్యూనిటీ బూస్టర్లు తీసుకుంటారు. వాటిని వైద్యుల సలహాలు, సూచనల మేరకు తీసుకుంటే మంచిది. అదే తొలి ఆప్షన్ కాకూడదు.

';

Disclaimer :

ఈ సమాచారం కేవలం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించిన తర్వాతే పాటించడం చాలా ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story