ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి
Ashok Krindinti
Jan 09,2025
';
ఇంట్లో వంట చేసే సమయంలో సడెన్‌గా గ్యాస్ అయిపోతే ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
';
అయితే చిన్న ట్రిక్స్‌తో సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో ముందే తెలుసుకోవచ్చు.
';
సిలిండర్ మీద తడి గుడ్డను చుట్టి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. సిలిండర్ ఖాళీ భాగంలో గుడ్డపై నీరు త్వరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న చోట నీరు ఆలస్యంగా ఆరిపోతుంది.
';
మీరు గ్యాస్‌ను వెలిగించినప్పుడు.. నీలం రంగులో మంట ఎక్కువగా బలంగా ఉంటే గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. మంట పసుపు రంగులో ఉండి.. తక్కవగా ఉంటే గ్యాస్ అయిపోవడానికి దగ్గరగా ఉన్నట్లు అర్థం.
';
సిలిండర్‌ను కొద్దిగా ఎత్తి దాని బరువును చెక్ చేయండి. బరువుగా ఉంటే గ్యాస్ ఉన్నట్లు. తేలికగా ఉంటే గ్యాస్ తక్కువగా ఉంటుంది.
';
కొత్త సిలిండర్‌ను బుక్ చేసుకున్నప్పుడు సీల్, రెగ్యులేటర్‌ను పూర్తిగా చెక్ చేసుకోండి. లీకేజీ ఉంటే.. వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి.
';
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం రాసినది. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.