ఇవి మిక్స్‌ చేసిన రైతా రోజు తింటే.. భారీ పొట్ట ఫ్లాట్‌ అవ్వాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jan 09,2025
';

ప్రస్తుతం చాలా మంది కూరగాయలతో చేసిన రైతా తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని అనుకుంటూ ఉంటారు.

';

నిజానికి మిక్స్ వెజిటబుల్ రైతా ప్రతి రోజు ఆహారాల్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇందులో అద్భుతమైన పోషకాలు లభిస్తాయి.

';

ముఖ్యంగా దీనిని బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ మిక్స్ వెజిటబుల్ రైతా తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

బరువు తగ్గడానికి మిక్స్ వెజిటబుల్ రైతా మీరు కూడా తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

మిక్స్ వెజిటబుల్ రైతాకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

';

కావలసిన పదార్థాలు: పెరుగు - 1 కప్పు, ముక్కలుగా కోసిన కూరగాయలు (క్యూకంబర్, టమాటో, ఉల్లిపాయ, క్యారెట్), కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు తరుగు

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, చాట్ మసాలా (కావాల్సినంత), నిమ్మరసం, నూనె (తాలింపు కోసం)

';

తయారీ విధానం: ముందుగా దీనిని తయారు చేసుకోవడానికి క్యూకంబర్, టమాటో, ఉల్లిపాయ, క్యారెట్‌లను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

వీటిని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పాత్ర పెరుగు తీసుకుని ఒక్కసారి బాగా మిక్స్‌ చేసుకోండి. అలాగే అందులో ఈ కూరగాయలు వేసుకోండి.

';

ఇలా అన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు తరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, చాట్ మసాలా వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత నిమ్మరం కలుపుకుని తీసుకోండి.. ఉదయాన్నే తీసుకుంటే బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story