ఈ సంక్రాంతిని శనగపిండి అరిసెల రెసిపీతో ప్రారంభించండి..

Dharmaraju Dhurishetty
Jan 11,2025
';

శనగపిండితో చేసిన బెల్లం అరిసెలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

ముఖ్యంగా బియ్యం పిండితో చేసిన అరిసెల కంటే శనగపిండితో చేసిన రుచి అద్భుతంగా ఉంటుంది.

';

శనగపిండి బెల్లం అరిసెలు సంక్రాంతి వేడుకల్లో తప్పక చేసే స్వీట్.. అయితే మీరు కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.

';

శనగపిండి బెల్లం అరిసెలకు కావాల్సి పదార్థాలు, తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: శనగపిండి - అర కిలో, బెల్లం - కిలో, నూనె - తగినంత, యాలకుల పొడి - అర టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: పచ్చ కర్పూరం - చిటికెడు, నీరు - తగినంత, ఉప్పు - చిటికెడు, కావాల్సినంత నెయ్యి

';

తయారీ విధానం: ముందుగా ఈ శనగపిండి బెల్లం అరిసెలను తయారు చేసుకోవడానికి పాకం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

';

దీని కోసం బెల్లం, నీరు, యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఓ స్టౌవ్‌ పెట్టుకుని అందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసుకుని బాగా పాకం లాగా తయారు చేసుకోండి.

';

ఇలా చేసుకున్న తర్వాత ఒక పాత్రలో శనగపిండిని తీసుకొని, ఉప్పు, పాకం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత వాటిని చేతులతో చిన్న చిన్న మందపాటి రోటీల్లా తయారు చేసుకోండి. ఆ తర్వాత కాడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోండి.

';

ఇలా నూనె వేసుకున్న తర్వాత అరిసెలను అందులో వేసుకోండి. బంగారు రంగు వచ్చిన తర్వాత అప్పల పీటలో వేసి బాగా నూనె బయటకు వచ్చేదాకా నొక్కండి. అంతే రెడీ అయినట్లే.

';

VIEW ALL

Read Next Story