సంక్రాంతి స్పెషల్ శనగ పిండి జంతికల రెసిపీ..

Dharmaraju Dhurishetty
Jan 11,2025
';

శనగ పిండి జంతికలు ఎంతో సులభంగా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.

';

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్నాక్‌ను ప్రతి ఫంక్షన్‌లో పెడుతూ ఉంటారు.

';

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి వేళలో ఎక్కువగా తయారు చేసుకుని తింటూ ఉంటారు.

';

కరకరలాడే ఈ జంతికలను సులభంగా ఎలా తయారు చేసుకొవాలో.. కావాల్సి పదార్థాలు తెలుసుకోండి.

';

శనగ పిండి జంతికలు తయారీ విధానం, కావాల్సి పదార్థాల పూర్తి వివరాలు ఇవే..

';

కావలసిన పదార్థాలు: శనగ పిండి, బియ్యం పిండి, నూనె, ఉప్పు, మిరియాల పొడి, వాము(కావాల్సినంత), కారం (రుచికి తగ్గట్టు)

';

తయారీ విధానం: ఒక పాత్రలో శనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు, మిరియాల పొడి, వాము వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

అన్ని పదార్థాలు మిక్స్‌ చేసుకున్న తర్వాత కారం వేసి.. వేడి నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

పిండిని దాదాపు 20 నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఓ బౌల్‌లో నూనె వేడి చేసుకోండి.

';

ఇలా నూనె వేడి చేసిన తర్వాత జంతికల మెషిన్‌ తీసుకుని దానిలో పిండి వేసుకుని నూనెలో జంతికలు వేసుకోండి..

';

జంతికలు నూనెలో వేసుకున్న బాగా గోలిన తర్వాత తీసి పక్కన తీసి పెట్టుకుంటే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story