Tulsi Leaves Remedies: చలికాలంలో రోజూ ఉదయం ఈ ఆకులు నమిలితే అన్ని వ్యాధులు దూరం
చలికాలం వచ్చిందంటే చాలు శరీరంలో చాలా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతాయి
అయితే ఆయుర్వేదపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్న ఈ ఆకులతో అన్ని వ్యాధులకు చెక్ చెప్పవచ్చు
చలికాలంలో తులసి ఆకులు తినడం చాలా ప్రయోజనకరం. అందుకే ఆయుర్వేదంలో తులసి ఆకుల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది
తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
తులసి ఆకుల్లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు దూరమౌతాయి.
తులసి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అజీర్తి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది
తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. శ్వాసలో దుర్వాసన, చిగుళ్ల నొప్పిని దూరం చేస్తుంది.