మహమ్మారి పీడ వదిలిపోయింది అనుకుంటే మరోకొత్త వైరస్ ప్రపంచాన్ని గడగడలాంచేందుకు వస్తోంది. ఇప్పటికే భారత్ లో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ పెంచే ఆహారాలను డైట్లో చేర్చుకోవాలి.
ఈ వైరస్ లు ఎక్కువగా చిన్నపిల్లులు, వ్రుద్ధులపైనే ఎక్కువగా అటాక్ చేస్తుంటాయి. ఎందుకంటే వీరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంటుంది. మన వంటింట్లో లభించే రకరకాల పదార్థాలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
చల్లగా మారిన గాలిలో తేమ ఉంటుంది. కాలం ఏదైనా సరే జలుబు, దగ్గు వంటి సాధారణమే. కానీ ఈ మహమ్మారి మాటు వేసిన వేళ ఆరోగ్యాన్ని మరింత భద్రంగా కాపాడుకోవడం ముఖ్యం.
మూడు గ్లాసుల నీళ్లు, అల్లం ముక్క, దాల్చిన చెక్క, తులసి ఆకులు, సోంపు చిటికెడు, తేనె, మిరియాలు, పచ్చి పసు పు ముక్క.
స్టౌ మీద గిన్నెలో నీళ్లు మరుగుతున్నపుడు వీటన్నింటినీ అందులో వేయాలి. ఆ నీళ్లు పావు కప్పు అయ్యేంత వరకు మరగించుకోవాలి. ఈ నీటిని వడబోసుకుని అందులో కాస్తే తేనె కలిపి వేడి వేడిగా తాలి.
ఈ పదార్థాలన్నింటిలోనూ ఔషధ గుణాలున్నాయి. వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయపడతాయి. ఈ కషాయం తాగితే జలుబు, దగ్గు ఇతర కాలానుగుణ వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ పేషంట్లు కూడా తీసుకోవచ్చు.
ఈ సమాచారం కేవలం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించిన తర్వాతే పాటించడం చాలా ఉత్తమం.