మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. మన బాడీలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. వీటికి కొన్ని ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది. అవి కొవ్వును వెన్నలా కరిగించేస్తాయట. అవేంటో తెలుసుకుందాం.
కాలే క్రూసిఫెరాల్ జాతికి చెందిన కూరగాయ. మన శరీరంలో నుంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కాలే కూడా సహాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను మన శరీరంలో నుంచి పారదోలడానికి పాలకూర కీలకాపాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ,కే, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
మన అందరి వంటిళ్లలో అందుబాటులో ఉండే వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను కట్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఇవి కూడా మార్కెట్లో విస్తృతంగా కనిపిస్తాయి. బ్రోకలీ కూడా క్యాలిఫ్లవర్ జాతికి చెందినది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అవకాడో కూడా మంచిది. ఎందుకంటే ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.