సంక్రాంతి పండగక్కి పిండి వంటలే స్పెషల్. ఒక్కొ ఇంట్లో ఒక్కోరకం పిండి వంటలు ఘుమఘుమలాడుతుంటాయి.
పిల్లల నుంచి పెద్దల వరకు పప్పు పకోడిలే అంటే చాలా ఇష్టంగా తింటారు. పండక్కు ఫ్యామిలీ అంతా కూర్చుని తింటుంటే ఆ సంతోషమే వేరు
పప్పు చకోడీలు మీరు చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటిస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఎలాగో చూద్దాం.
నూనె, బియ్యం పిండి, శెనగపిండి, పసుపు, కారం, ఉప్పు, వాము, శెనగపప్పు
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 2టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడెక్కిన తర్వాత పొడి బియ్యంపిండి వేయాలి. కప్పు బియ్యం పిండికి 2 టైబుల్ స్పూన్ల శనగ పిండి వేయాలి.
చిన్న మంటపై పిండి రంగు మారే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. పిండి చల్లారిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వాము, వేసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి.
ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చెకోడిలా చేసుకుని శెనగపప్పు వేసి రోల్ చేయాలి. ఇలా చేస్తే పప్పు పిండికి అంటుకుంటుంది.
ఇప్పుడు వాటిని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే పప్పు చకోడిలు టేస్టీగా ఉంటాయి. మీరూ ట్రై చేయండి.