మకర సంక్రాంతికి నైవేద్యంగా స్వీట్లను సమర్పిస్తారు. ఇప్పుడు పెసరపప్పు పాయసం రెసీపీ ఎలా తయారు చేస్తారో చూద్దాం.
పెసరపప్పు, బెల్లం తురుము, నెయ్యి, జీడిపప్పు, కిస్ మిస్, యాలకులు, కొబ్బరితురుము, పాలు
ఇతర పాయసాల కంటే పెసరపప్పు పాయసం చాలా రుచిగా ఉంటుంది.
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి పెసరపప్పు వేసి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి.
పెసరపప్పు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అదే కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మీస్ లు వేయించి పక్కన పెట్టాలి.
ఒక గిన్నెలో పాలు వేసి మరగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత అందులో పెసర పప్పు వేసి బాగా ఉడకనివ్వాలి.
పెసరపప్పు 80శాతం ఉడికిన తర్వాత బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం ద్రవంలా మారుతుంది. అది పాయసంలా చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇప్పుడు అందులో కొంచెం కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం పాయసంలా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
పాయసంలా మారిన తర్వాత దానిపై జీడిపప్పు, కిస్ మిస్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే సింపుల్ పెసరపప్పు పాయసం రెడీ