సంక్రాంతి వస్తుందంటే తెలంగాణ పల్లెలు పిండి వంటలతో ఘుమఘమలాడుతుంటాయి. ఏ గల్లికి పోయినా పిండివంటలే పలకరిస్తుంటాయి.
మరి ఈ సంక్రాంతి పండక్కి తెలంగాణ స్టైల్ సకినాలు చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఈ టిప్స్ ఫాలో అయితే సకినాలు కరకరలాడుతుంటాయి.
బియ్యం, నువ్వులు, ఉప్పు, వాము, నీళ్లు, నూనె
ఒక బౌల్ తీసుకుని అందులో 6 కప్పుల బియ్యం పోసి కడిగి 15 నుంచి 16 గంటల వరకు రాత్రంతా నానబెట్టాలి.
ఈ బియ్యాన్ని తీసి ఒక కాటన్ వస్త్రంపై 10 నుంచి 15 నిమిషాల వరకు ఆరబెట్టాలి. బియ్యం పూర్తి ఆరకముందే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు ఆ పిండిలో నువ్వులు, వాము వేసి రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని కలపాలి.
పిండి మరీ వదులుగా కాకుండా గట్టిగానే అంటే చేతిలో వేసుకుంటే జారీపోయే విధంగా నీళ్లు పోసి కలుపుకోవాలి.
ఆ పిండిని కాసేపు పక్కన పెట్టి మరో శుభ్రమైన కాటన్ వస్త్రం తీసుకుని నేలమీద పరుచుకోవాలి.
పిండి తీసుకుని కాటన్ క్లాత్ పై వేళ్ల సహాయంతో సన్నగా పిండిని వదులుతూ గుండ్రంగా తిప్పుకోవాలి. ఇలా వేసినవాటిని నూనెలో వేయించుకోవాలి. అంతే సకినాలు రెడీ