సంక్రాంతికి నువ్వులతో తయారు చేసిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. సంక్రాంతి స్పెషల్ నువ్వు బర్ఫీ రెసీపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల నువ్వులు, బెల్లం, నెయ్యి, యాలకులపొడి, బాదం తరుగు, పిస్తా తరుగు, జీడిపప్పు
స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించాలి. ఆ నెయ్యిలో బెల్లం తురుము వేసి కలపాలి. పావు కప్పు నీళ్లను పోసి బెల్లం కరికే వరకు మరగనివ్వాలి.
ఈ లోపు నువ్వులు మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ నువ్వుల పొడిని ఈ బెల్లం పాకంలో వేసి కలపాలి. చిన్న మంట మీద ఉడికించాలి.
ఈ మొత్తం మిశ్రమం బర్ఫీలా దగ్గరకు వచ్చేంత వరకు కలపాలి.
దగ్గరకు వచ్చిన మిశ్రమంలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక ప్లేటు తీసుకుని దానికి నెయ్యి రాసి అందులో ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఇప్పుడు దానిపై జీడిపప్పు, బాదం తరుగు , పిస్తా తరుగు పైన చల్లాలి. ఓసారి గరిటతో నొక్కాలి.
అది గట్టిపడేవరకు అలాగే వదిలేయాలి. తర్వాత చాకుతో ముక్కులుగా కట్ చేసుకుని గాలి చొరబడని డబ్బాల్లో వేసి దాచుకోవాలి.