ఈ పండ్లు మీ ఆహారంలో తప్పకుండా గుండెపోటుకు మీరు దూరంగా ఉండొచ్చు.
ఆరెంజ్: ఈ పండు విటమిన్ C తో నిండినది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమర్ధమైన ఆంటీ ఆక్సిడెంట్స్ తో అందించి.. గుండెపోటును నివారించడంలో సహాయపడుతుంది.
ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 తో నిండి ఉన్న అరటి పండ్లు, గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. వారానికి మూడు రోజులైనా.. ఒక పండు తినడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.
బ్లూ బెర్రీస్: ఈ పండు గుండెకు అనుకూలంగా ఉండే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది. ఇది గుండెపోటు, రక్తపోటు, మరియు శరీరంలో కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది.
మంచి ఫైబర్, విటమిన్ C, ఎంటీ ఆక్సిడెంట్స్ తో.. బ్లాక్ బెర్రీలు గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చెయ్యదంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది శరీరంలో హానికరమైన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
పపాయ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడే పండుగా కొన్ని సర్వేలలో కూడా గుర్తించబడింది. ఇది శరీరంలోని శక్తిని పెంచే, కొవ్వు కరిగించి..గుండెకు మంచి ఆరోగ్యం అందిస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, నిపుణుల సలహాల మేరకు మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.