కరివేపాకు హెయిర్ కేర్ రొటీన్లో వాడటం వల్ల అనేక లాభాలు పొందుతారు.
కరివేపాకు తినడం మాత్రమే కాదు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు మందంగా, దృఢంగా మారుతుంది.
కరివేపాకు తాజా ఆకులను గ్రైండ్ చేసి అందులో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి మీ జుట్టుకు అప్లై చేస్తే మ్యాజిక్ చూస్తారు.
కరివేపాకు ప్యాక్ జుట్టుకు అప్లై చేసిన ఓ గంట తర్వాత సాధారణ షాంపూతో హెయిర్ వాష్ చేయాలి.
ఇలా చేయడం వల్ల మీ జుట్టుకు సరైన పోషకాలు అందుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది.
మీకు ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న కరివేపాకుతో తగ్గిపోతుంది.
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కరివేపాకు వల్ల కుదుళ్ల ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.
అంతేకాదు కరివేపాకుతో నూనె కూడా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి.
కొబ్బరినూనెలో కరివేపాకు పేస్ట్ వేసి నూనె సగం అయ్యే వరకు బాగా మరిగించాలి.
చల్లారిన తర్వాత ఓ కంటైనర్లో పోసి పెట్టుకోవాలి. ఇందులో విటమిన ఇ ఆయిల్ కూడా వేసుకుని తలకు పట్టించుకోవచ్చు.
కరివేపాకు నూనె, హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు తెల్లబడటం కూడా తగ్గిపోతుంది.