Water Intake: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత నీరు తాగాలి
చలికాలంలో సాధారణంగా దాహం పెద్దగా ఉండదు. దాంతో నీటి పరిమాణం తగ్గిపోతుంది. అయితే చలికాలంలో కూడా శరీరం హైడ్రేట్‌గా ఉండటం చాలా అవసరం
చలికాలంలో గాలి పొడిగా ఉంటుంది. దాంతో చర్మం డ్రై కావచ్చు. రోజూ తగినంత నీళ్లు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. మృదువుగా ఉంటుంది
నీరు అనేది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు తొలగిస్తుంది.
చలికాలంలో నీళ్లు తక్కువ తాగడం వల్ల పెదాలు ఎండిపోతుంటాయి. దాంతోపాటు చర్మం నిర్జీవంగా మారుతుంది
అందుకే ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చలికాలంలో రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు పాలు, జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి