బస్సు డ్రైవర్ కుమారుడు నుంచి ప్యాన్ ఇండియా స్టార్.. KGF స్టార్ యశ్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాంకే..
యశ్.. ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జనవరి 8న 1986లో కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలోని భువనహళ్లి సాధారణ కుటుంబంలో జన్మించారు.
తండ్రి కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్. అసలు పేరు నవీన్ గౌడ.. కన్నడలో ‘ఉత్తరాయణ’ టీవీ సీరియల్ తో నట ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై సినిమాల్లో హీరోగా స్థిర పడ్డారు.
2004లో టీవీ సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2007 ‘జంబాడా హుడుగి’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసారు.
2013లో ‘గూగ్లీ’ ఆ తర్వాత 2014లో ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, మాస్టర్ పీస్ సినిమాలతో మంచి పేరు కర్ణాటకలో నటుడగా పేరు సంపాదించుకున్నాడు.
2018లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన K.G.F: చాప్టర్ 1 (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్), K.G.F: చాప్టర్ 2 (2022)సినిమాలతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు. కర్ణాటక నుంచి రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశారు.
ఇన్నేళ్ల కెరీర్ లో యశ్ సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా రూ. 53 కోట్ల నికర ఆస్తులు సంపాదించినట్టు సమాచారం.
కేజీఎఫ్ సినిమా ముందు వరకు ఒక్కో సినిమా రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య తీసుకునే యశ్.. కేజీఎఫ్.. ఇపుడు ఒక్కో సినిమా రూ. 40 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.
కేజీఎఫ్ సినిమా ముందు వరకు యశ్ యేడాదికి రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల మధ్య ఉండేది. ఒక్కో బ్రాండ్ ఎండర్స్ మెంట్ కోసం రూ. 60 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
హౌసింగ్. కామ్ ప్రకారం యశ్ బెంగుళూరులో ఎంతో లావిష్ డ్యూప్లెక్స్ హౌస్ ఉంది. దీని విలువ రూ. కోట్లు. వాహనాల విషయానికొస్తే.. Mercedes-Benz GLS, Audi Q7, BMW 520D మరియు పజెరో స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి.