గుడ్డు.. క్యారెట్.. రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థాలు.
మరి అలాంటి రెండిటినీ కలిపి ఒక సూపర్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
స్టవ్ మీద కళాయి లో నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్ వేసి వేయించుకోవాలి.
అది అయ్యాక స్టవ్ ఆపేసి..మరొక గిన్నెలో రెండు లేదా మూడు కోడిగుడ్లను బాగా గిల కొట్టుకొని పెట్టుకోండి.
ఆ కోడిగుడ్ల మిశ్రమంలోని రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ మిరియాల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న కార్యక్రమం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాసుకొని.. మనం చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి.
రెండు వైపులా సరిపడా కాల్చుకున్నాక.. తీసి ప్లేట్లో వేసి సర్వ్ చెయ్యండి. ఎంతో రుచికరమైన క్యారెట్ ఆమ్లెట్ రెడీ. ఇందులో ఉన్న అధిక ప్రోటీన్ల వల్ల ఈ ఆమ్లెట్ తింటే మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుందట.