ఇడ్లీ.. దోశలోకి.. ఎంతో రుచికరమైన.. ఆరోగ్యకరమైన అరటికాయ కారంపొడి.. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం
స్టవ్ వెలిగించి పెనుము పెట్టి దానిపై అరటికాయలను ఉంచి రెండు పక్కల కాల్చాలి.
ఆ తరువాత అరటికాయ కొంచెం చల్లారాక.. మెల్లగా తొక్కను తీసేయాలి.
మెత్తగా అయిన అరటికాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి..కడాయి లో నూనె వేసుకొని ధనియాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, మిరియాలు, కొబ్బరి తురుము, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
ఇవన్నీ వేగాక వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. మరోసారి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆవాలు, మినప్పప్పు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి. వాటితో పాటు అరటికాయ తురుమును వేసి బాగా కలుపుకోవాలి.
ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పుని దాంతో పాటు పసుపు వేసుకోవాలి.
ఇక ఈ అరటికాయ మిశ్రమంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
చిన్న మంట మీద అది పొడిపొడిగా అయ్యేవరకు బాగా వేయించాలి. దీంతో ఎంతో రుచికరమైన అరటికాయ పొడి రెడీ.