బట్టతల రాకుండా మర్దన (మసాజ్) మేలు చేస్తుంది. రోజులో ఒకటి రెండుసార్లు జుట్టును రుద్దుతూ.. లేదా బలంగా దువ్వుతూ ఉండాలి.
బట్టతల రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మానసిక, శారీరక ఒత్తిడితో జుట్టు రాలడం ప్రారంభమై క్రమగా బట్టతల వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకుంటే చాలు.
కొత్తగా గుమ్మడికాయ నూనె కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నూనె వినియోగిస్తే కూడా ప్రయోజనం ఉంటుంది.
మానవ ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది. ఈ ఆయిల్‌ను తలకు రాసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
బట్టతల రాకుండా అడ్డు కోవడానికి ఉసిరికాయ నూనె చాలా మేలు చేస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. రోజు ఈ నూనె వాడితే బట్టతల నివారణ సాధ్యం.
తలకు క్రమంగా ఆల్మండ్ ఆయిల్ వాడితే జుట్టు కోల్పోవడం తగ్గుతుంది.