ఈ వన్‌ప్లస్ నార్డో CE 4 5G స్మార్ట్‌ఫోన్ 6.73-అంగుళాల AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీని స్క్రీన్ HDR10+ సపోర్ట్ చేస్తుంది.
ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. ఇది 2.63 GHz ఆక్టా-కోర్ CPUను కలిగి ఉంటుంది.
ఇక ఈ మొబైల్ 8GB ర్యామ్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు రెండు (128GB/256GB) స్టోరేజ్ వేరియంట్స్‌లో లభించనుంది. అదనంగా మెమోరీని పెంచుకోవడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో మార్కెట్‌లోకి రానుంది. దీని బ్యాక్ సెటప్‌లో 64MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది.
అలాగే అదనంగా ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉంటాయి. దీంతో పాటు 16MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది.
ఈ వన్‌ప్లస్ నార్డో CE 4 5G మొబైల్ 5000mAh బ్యాటరీ సెటప్‌తో పాటు 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది.
ఈ మొబైల్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు అదనంగా 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ సెటప్‌లు కూడా లభిస్తాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇందులో 8GB + 128GB రూ.23,999 కాగా, 8GB + 256GB స్టోరేజ్ మొబైల్ రూ.25,999తో లభిస్తోంది.
ఈ మొబైల్ ఏప్రిల్ 1 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, OnePlus.in అధికారిక వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి రానుంది.