CAA అనగా Citizenship Amendment Act- తెలుగులో పౌరసత్వ సవరణ చట్టం.
మార్చి 11, 2024 తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అంటే నాలుగేళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది.
సీఏఏ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. దరఖాస్తుదారులు భారతదేశానికి ఎప్పుడు వచ్చారో తెలియజేయాలి.
సీఏఏ రూల్స్ ప్రకారం, 31 డిసెంబర్ 2014 లోపల బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరియు క్రైస్తవులకు ఈ పౌరసత్వం ఇవ్వబడుతోంది.
ఈ చట్టం జనవరి 10, 2020న రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టంగా మారింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు ఏదో ఒక రకంగా చిత్రహింసలకు గురై భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వం లభిస్తుంది.
CAA కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారు చాలా పత్రాలను అందించాల్సిన అవసరం లేదు.
విదేశీయుల చట్టం-1946 మరియు పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం-1920 ప్రకారం, అక్రమ వలసదారులను జైల్లో ఉంచవచ్చు లేదా వారి దేశానికి తిరిగి పంపవచ్చు.
ఈ చట్టం ప్రకారం, పాస్‌పోర్ట్ మరియు వీసా వంటి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు.