దేశంలో ఐపీఎల్ ఫీవర్ వచ్చేసింది. మార్చి 22న 17వ సీజన్ ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.
ఈసారి ఐపీఎల్లో అత్యంత ఎక్కువ వయసు కలవాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
42 ఏళ్ల ధోనీ తన కెప్టెన్సీలో ఇప్పటివరకు 5 సార్లు చెన్నై జట్టును ఛాంపియన్గా నిలిపాడు.
ధోని ఐపీఎల్లో ఇప్పటివరకు 250 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 38.79 సగటుతో 5,082 పరుగులు చేశాడు.
ఈసారి ఐపీఎల్ లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడికి అంగ్క్రిష్ రఘువంశీ నిలిచాడు. ఇతను 5 జూన్ 2005న ఢిల్లీలో జన్మించాడు.
2024 వేలంలో కేకేఆర్ అంగ్క్రిష్ రఘువంశీని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.
2022లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచకప్లో అంగ్క్రిష్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు.
ఈ వరల్డ్ కప్ లో అంగ్క్రిష్ 6 మ్యాచ్ల్లో 46.33 సగటుతో 278 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ మరియు ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.