ఐపీఎల్ 2024 సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో యంగ్ ఫ్లేయర్ రియాన్ పరాగ్ అగస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 5 మ్యాచ్‌ల్లో 17 సిక్సర్లు బాదాడు.
ఈ జాబితాలో సన్ రైజర్స్ ఫ్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ రెండో స్థానంలో నిలిచాడు. అతడు కూడా 5 మ్యాచ్‌ల్లో 17 సిక్సర్లు కొట్టాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా విరాట్ తర్వాత పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
SRH యువ ఆటగాడు అభిషేక్ శర్మ 5 మ్యాచ్‌ల్లో 16 సిక్సర్లు కొట్టి మూడో స్థానంలో ఉన్నాడు.
అభిషేక్ శర్మ ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు. ముంబైపై కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
LSG విధ్వంసక బ్యాటర్ నికోలస్ పురాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు 4 మ్యాచ్‌ల్లో 15 సిక్సర్లు కొట్టాడు.
కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ కూడా ఈ లిస్ట్ ఐదో స్థానంలో నిలిచాడు. అతడు 4 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు కొట్టాడు.
సునీల్ నరైన్ ఢిల్లీ క్యాపిటల్స్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 7 ఫోర్లు, సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు.
టాప్-10లో కోహ్లి కూడా ఉన్నాడు. విరాట్ 6 మ్యాచ్‌ల్లో 12 సిక్సర్లు కొట్టి 9వ స్థానంలో ఉన్నాడు.