బరువు తగ్గడానికి ఆయుర్వేద రెసిపీ
ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది ఊబకాయం, అధిక బరువు, వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆయుర్వేద రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.
రాజ్మా, రెడ్ క్యాప్సికమ్, సొంఠి, ఉప్పు, మిరియాలు, స్వీట్ కార్న్, పిప్పళ్లు, క్వినోవా
ముందుగా నానబెట్టిన క్వినోవా, రాజ్మాను ఉడికించికుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్ళను మరిగించుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించిన క్వినోవా, రాజ్మా వేసుకోవాలి.
మరో గిన్నెలో కొన్ని క్యాప్సికమ్ ముక్కులు, గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పెస్ట్ వేసి కలుపుకోవాలి.
సొంఠి, పిప్పళ్లను నెయ్యిలో వేయించి తీసుకోవాలి. ఇందులో పావు స్పూన్ మిరియాలు వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ఉడికించి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని రుచికి సరిపడిన ఉప్ప వేసుకొని కట్‌లెట్స్‌లా తయారు చేసుకోవాలి.