ఈ నూనె రాస్తే చాలు.. బట్ట తలపై కూడా జుట్టు పెరుగుతుంది..
జుట్టు పెరుగుదలలో నువ్వుల నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నువ్వుల నూనె జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది చుండ్రు నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
వేప నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.
బ్రాహ్మీ హెర్బ్ నుండి తీసుకోబడిన బ్రాహ్మీ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది హెయిర్ గ్రోత్ కు సంబంధించి రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.
జబోరండి ఆయిల్ ను జబోరండి మొక్క నుండి తీసుకోబడుతుంది. ఈ నూనె నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగు పరిచి జుట్టు పెరడగడంలో దోహదం చేస్తుంది.
ఆమ్లా (ఉసిరి)లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి కారణంగా జుట్టు పెరగడంలో దోహదం చేస్తుంది. అంతేకాదు ఉసిరి నూనె జుట్టు కుదుళ్లను బలపరచడంతో సహాయ పడుతుంది. జుట్లు రాలడాన్ని నివారిస్తుంది.
భృంగరాజ్ తైలం ‘మూలికల రాజు’ గా పిలుస్తారు. ఇది జుట్టు కుదుళ్ల నుంచి గట్టిగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడం సహాయ పడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టు సంరక్షణ కోసం ప్రజలు విస్తృతంగా ఉపయోగించే నూనెలలో కొబ్బరి నూనె ఒకటి. కొబ్బరి నూనె జుట్టును తేమగా మరియు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
(ఈ వెబ్ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అర్హత కలిగిన వైద్య నిపుణులు అందించిన సలహాలు, సూచనలను తీసుకొండి.)