స్పీడ్‌గా బరువు తగ్గించే కర్రీ రెసిపీ.. ఇది మీకు తెలిస్తే రోజు తింటారు!
Dharmaraju Dhurishetty
Jan 10,2025
';
చనా మసాలా అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. కొంతమంది ఈ రెసిపీని ఎంతో ఇష్టపడి మరి తింటూ ఉంటారు.
';
హెల్తీ రెసిపీలో చనా మసాలా కూడా ఒకటి.. ఇది నూటికి అద్భుతమైన టేస్ట్ను అందించడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలను చేకూర్చుతుంది.
';
ముఖ్యంగా ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఒక ప్రత్యేకమైన రెసిపీగా చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు డైట్ లో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.
';
అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఈ చనా మసాలాను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా హోటల్ స్టైల్ లో రెడీ చేసుకోండి.
కావలసిన పదార్థాలు: యాలకులు - 1, జీలకర్ర - 1/2 టీస్పూన్, బిర్యానీ ఆకు - 2, కారం పొడి - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్, గరం మసాలా - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగి)
';
తయారీ విధానం: ఈ చనా మసాలాను తయారు చేసుకోవడానికి ముందుగా శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
నానబెట్టుకున్న తర్వాత ఉదయం శనగలను ప్రెషర్ కుక్కర్‌లో వేసి కూరకు తగ్గట్లుగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టౌ పై ఒక బౌల్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి.
';
నూనె వేసుకున్న తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని రంగు మారేంతవరకు బాగా వేపుకోండి.
';
ఇలా అన్ని వేపుకున్న తర్వాత అందులోనే టమాటో పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా వేపుకుంటూ ఉడికించండి.
';
ఇలా బాగా ఉడికిన తర్వాత శనగలు వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది.
';
ఈ రెసిపీని బరువు తగ్గాలనుకునే వారు డైట్ లో చేర్చుకుంటే తప్పకుండా కారం, ఉప్పు, నూనె తక్కువ మోతాదులో వినియోగించడం మంచిది.