చికెన్ -750 గ్రామ్స్ పచ్చిమిర్చి- 2 లైట్ గ్రీన్ పచ్చిమిర్చి -15 ఉల్లిపాయలు -2 అల్లం- 1TBSP వెల్లుల్లి రెబ్బలు- 8 ఆయిల్-3 TBSP జీలకర్ర -2 TBSP ఉప్పు -తగినంత గరం మసాలా 1/2 TBSP నిమ్మకాయ
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పెట్టుకోవాలి
వీటన్నిటినీ ఒక బ్లెండర్ లో వేసి ఫైన్ పేస్ట్ లో బ్లెండ్ చేసుకోవాలి
ఇప్పుడు ఒక కడాయి స్టవ్ ఆన్ చేసి పెట్టి దాంట్లో నూనె వేసి జీలకర్ర వేసి వేయించుకోవాలి
ఇప్పుడు లైట్ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకొని ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి
ఇప్పుడు ఇందులో పసుపు చికెన్ ముక్కలు ఉప్పు వేసి ఎక్కువ మంటపై ఓ మూడు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి
ఇప్పుడు మూత తీసి ఒక కప్పు నీళ్లు అందులో యాడ్ చేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు చికెన్ బాగా ఉడికే వరకు పండుకోవాలి
ఇప్పుడు చివరిగా ఇందులో గరం మసాలా గరం వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో లెమన్ ముక్కలు కూడా పిండుకుంటే సరిపోతుంది