డ్రై ఫ్రూట్స్‌ నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వారు ఈ షాక్‌ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువును పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

ఈ షేక్ తయారు చేయడం చాలా సులభం కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువ. డ్రై ఫ్రూట్స్ లోని పోషకాలు, పాల శక్తి మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి.

';

దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువును పొందవచ్చు.

';

ముఖ్యంగా చిన్న పిల్లలు తీసుకోవడం వల్ల వివిధ రకాల పోషకాలు, విటమిన్‌లు దొరుకుతాయి.

';

కావలసిన పదార్థాలు: 1 లీటర్ పాలు, 1/4 కప్పు మిశ్రమ డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్), 2 టేబుల్ స్పూన్ల పంచదార (రుచికి అనుగుణంగా)

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ యాలకుల పొడి, 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఐస్ క్యూబ్స్ (అవసరమైతే), కొద్దిగా కుంకుమపువ్వు

';

తయారీ విధానం: డ్రై ఫ్రూట్స్ ను చిన్న ముక్కలుగా కోసుకోండి. ఒక గిన్నెలో పాలు, పంచదార, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, కుంకుమపువ్వు కలపండి.

';

మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, మరిగించాలి. మిశ్రమం మరిగిన తర్వాత, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

';

స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని చల్లబరచండి. చల్లబడిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి, నునుపుగా పేస్ట్ చేసుకోండి.

';

ఐస్ క్యూబ్స్ (అవసరమైతే) వేసి మరోసారి బ్లెండ్ చేయండి. ఒక గ్లాసులో పోసి వెంటనే సర్వ్ చేయండి.

';

మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగించుకోవచ్చు.షేక్ కు మరింత రుచి కోసం ఖర్జూర పానకం కూడా వేసుకోవచ్చు.

';

పిల్లలకు ఇస్తున్నట్లయితే, పంచదార మొత్తాన్ని తగ్గించవచ్చు.

';

VIEW ALL

Read Next Story