ఈ దోసలు తింటే ఎంత సైట్ ఉన్న కళ్లు క్లియర్గా కనిపిస్తాయి!
Dharmaraju Dhurishetty
Nov 01,2024
';
నిజానికి క్యారెట్ దోస తినడం వల్ల శరీరానికి విటమిన్ ఏతో పాటు విటమిన్ కె, అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది.
';
కాబట్టి రోజు క్యారెట్ దోస తినడం వల్ల శరీరం శక్తివంతంగా తయారవుతుంది.
';
ఈ క్యారెట్ దోశలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తగిన శక్తినందించి.. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
';
అలాగే క్యారెట్ దోసను రోజు తినడం వల్ల కంటిచూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది.
';
మీరు కూడా ఇంట్లోనే ఎంతో సులభంగా క్యారెట్ దోసను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా చేసుకోండి.
';
క్యారెట్ దోసకు కావలసిన పదార్థాలు, స్టెప్పుల వారిగా తయారీ విధానం..
';
కావలసిన పదార్థాలు: 1 కప్పు వంటి, మెత్తగా తరిగిన క్యారెట్లు, 1 కప్పు ఇడ్లీ రవ్వ, 1/2 కప్పు పెరుగు, 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు
';
కావలసిన పదార్థాలు: 1/4 కప్పు కొత్తిమీర ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఉప్పు రుచికి సరిపోయేంత, నూనె వేయడానికి
';
తయారీ విధానం: ముందుగా క్యారెట్ దోసను తయారు చేసుకోవడానికి ఒక ఇడ్లీ రవ్వ, మినప గుండ్లను నీటిలో నానబెట్టి మూడు గంటల తర్వాత శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంది.
';
ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకొని పిండిలాగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులోనే కావలసినంత పెరుగు, క్యారెట్లు, ఉల్లిపాయలు వేసి మరోసారి బాగా మిక్సి కొట్టుకోండి.
';
ఆ తర్వాత ఇందులో తగినంత జీలకర్ర, మిర్యాల పొడి, కొత్తిమీర వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మరో రెండు గంటల పాటు పక్కన పెట్టుకొని తయారు చేసుకుంటే అద్భుతమైన రుచి పొందుతారు.
';
అయితే దోశలు వేసుకోవడానికి స్టవ్ పై నాన్ స్టిక్ పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తయారు చేసుకున్న పిండిని దోసల్లా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాల్సి ఉంటుంది.
';
బాగా గోల్డెన్ కలర్ లో కాలిన తర్వాత దోశలను తీసుకొని పల్లి చట్నీ లేదా పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకోవడమే..