బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో క్యాల్షియం, ఐరన్‌తో సహా అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని పిల్లలకు తినిపించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం ఫాస్పరస్‌తో సహా అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వింటర్ లో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల పిల్లలు రోగాల బారిన పడకుండా ఉంటారు.
పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. శీతాకాలంలో పాలులో పసుపు కలుపుకుని తాగితే ఈ జబ్బు రాదు. అంతేకాకుండా మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల పిల్లల చాలా ఆరోగ్యంగా ఉంటారు.
చలి కాలంలో కూరగాయల సూప్ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని అనారోగ్యం దరిచేరదు.
చిలకడ దుంపలో శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని పాన్ మీద కాల్చి లేదా ఉడకబెట్టుకుని తినవచ్చు. దీనిని వింటర్ లో తీసుకుంటే హెల్తీగా ఉంటారు.
నట్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడతారు. కాబట్టి వీలైనంత వరకు వీటిని డైట్ లో చేర్చండి.