అవకాడో నూనెలో ఉండే ఒలీక్ యాసిడ్ వల్ల బీపీ లెవల్స్ తగ్గుతాయి. అంతేకాదు మీ సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం వల్ల హైపర్ టెన్షన్ ను నిర్వహిస్తుంది.
ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఫ్రీ రాడికల్ సమతుల్యం చేస్తాయి. ఆక్సిడేటీవ్ స్ట్రెస్ తగ్గిస్తుంది.
అవకాడో నూనెలో ఉంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్ బ్రెయిన్ ఆరోగ్యకరమైన పనితీరుకు సహకరిస్తుంది.
అవకాడో నూనెలో లుటీన్, గ్జియాంథిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి ఎంతో మంచివి.
అవకాడో నూనెలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం ల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్ సమస్య తగ్గి చర్మం మెరుస్తుంది.
ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్ వల్ల బరువు నిర్వహణ సాఫీగా సాగుతుంది. అవకాడో నూనె మన డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది.
అవకాడో నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కరిగే విటమిన్స్ అంటే విటమిన్ ఏ, డీ, ఈ, కే. న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటాయి.
అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పేగు కదలిక, మంచి జీర్ణ ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది.
ఇందులో ఒలీక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వాపు సమస్యలను తగ్గిస్తాయి.
అవకాడోలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించే ఒలీక్ యాసిడ్ కూడా ఉంటుంది.