బయట జంక్ ఫుడ్ కి మనము ఎక్కువగా అలవాటు పడిపోయాం. అందుకు ముఖ్య కారణం స్పైసీగా, క్రిస్పీగా ఉండే వాటి రుచి.
అయితే అదే రుచి తో కూడిన వంటకాలు..ఆరోగ్యవంతమైన కూరగాయలతో కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు..
క్యారెట్ 65.. ఇది ఒకసారి తింటే ఇంక మీరు దీన్ని వదిలిపెట్టరు. క్యారెట్ లో ఎన్ని పౌష్టిక పదార్థాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే.
మరి అలాంటి క్యారెట్ 65 తయారీ విధానాన్ని మనం ఈరోజు చూద్దాం.
ముందుగా క్యారెట్లను చిప్స్ లాగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ తరువాత వాటిని కాసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఒక చిన్న గిన్నెలో పచ్చిమిర్చి, కార్న్ ఫ్లోర్, మైదా, మిరియాలపొడి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
కలర్ కావాలి అంటే రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కాస్త నీళ్లు చేర్చి బజ్జీల పిండిలా కలపాలి.
ఈ పిండిలో క్యారెట్ ముక్కలను వేసి కలిపి.. స్టవ్ పై నూనె పెట్టుకొని.. ఆ నూనె కాగాక క్యారెట్ ముక్కల్ని వేసి వేయించాలి.
గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన వెంటనే మీ ప్లేట్ లోకి వేసుకుంటే చాలు.. ఎంతో రుచికరమైన క్యారెట్ 65 రేడీ.