ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమ అనేది ఎంతో విలువైనది.
ఏదైనా మర్చిపోగలం కానీ మొదటి ప్రేమ అనేది ఎప్పటికీ మరిచిపోలేము.
మొదటి ప్రేమ అనేది ఎందరికో చేదు జ్ఞాపకం.. కానీ అదే జ్ఞాపకాన్ని మధుర జ్ఞాపకంలా ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు.
అయితే అలా ఎందుకు జరుగుతుంది అని ఈ మధ్య ఒక సర్వే జరగగా అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి
US దినపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మొదటి ప్రేమ స్కైడైవ్ లాంటిది…అంటే దాదాపు ఆకాశం నుంచి కింద సున్నా కి దూకడం..
అలా దూకితే మనకి ఎలాంటి అనుభవం వస్తుందో మొదటి ప్రేమ కూడా అలానే ఉంటుందట.
అంతేకాదు మొదటి ప్రేమలో ఎన్నో విషయాలు మొదటిగా జరుగుతాయి..
ప్రేమ.. భయం.. ముద్దు.. కౌగిలింత.. ఇలా ఎన్నో విషయాలు మొదటిగా మన మనసులోకి చేరుతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం తొలిప్రేమ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనస్సులో ఒక చిన్న ఆనందం పుడుతుంది. అందుకే తమ తొలి ప్రేమను ఎవరూ మరిచిపోలేరట